నీ దగ్గర ఏముంది?
నీ దగ్గర ఎంతుంది?
నా దగ్గర అంతుంది
నా దగ్గర యింతుంది
యివే ప్రశ్నలు
నాలుగు దిక్కులా ప్రతిధ్వనిస్తున్నాయి
తింటానికి తిండి వున్నది
వుంటానికి ఒక గుడిసె వున్నది
జేబునిండా చిల్లర వుంది
ప్రశ్నలు అడిగే మనుషులందరికి
జవాబు చెప్పే ధైర్యంవుంది
విందుభోజనం పై ఆశలు లేవు
లంకంత ఇల్లు నాకక్కరలేదు
అనారోగ్య జీవికి స్వర్ణ మెందుకు?
దానంచేయని చేతికి సొమ్ములెందుకు?
జవాబు చెప్పే ధైర్యంవున్నా
ప్రశాంత జీవనం నా జీవిత ధ్యేయం
జానేడు పొట్టకు
గుప్పెడు మెతుకులు
కనిపించని ఆత్మకు
కనిపించే దేహం
ఆరడుగుల దేహానికి
ఒక చిన్న గుడారం
కష్టపడటం
దైనందిన కర్తవ్యం
ఫలితం దక్కుట
దేవుని చిత్తం
చివరి రోజున
నలుగురు మనుషులు
కాటికి చేర్చి
ఖననం చేస్తే
భూమికి మిగిలెను
పిడికెడు బూడిద
ఏముందని అడక్కు నేస్తం
ఎంతుందని అడక్కు నేస్తం
నువ్వు నాకు తోడుంటే
ఆనందమె ఈ జీవిత పరమార్ధం
-0-
భవాని
Date: Feb-16-2009, Atlanta, USA





[...] Author: WordPress.com Top Posts [...]