వేదం – ఒక మంచి మనసున్న చిత్రం
మొదట అనుష్క పాడిన పాట భావం చాలా బాగుంది.
మంచి మంచి సంభాషణలు వున్నాయి.
నీళ్ళని ఒకడు పానీ అంటాడు. ఒకడు వాటర్ అంటాడు.
దేవుడు ఒక్కడే. పేర్లు వేరు.
చాలా చాలా మంచి సంభాషణలు వున్నాయి.
కొన్ని చోట్ల మాటలు వుండవు. వాటి అవసరం లేకుండా చూపించటం చాలా మంచి, గొప్ప విషయం.
అన్నీ రాసేస్తే చిత్రం ఎవరు చూస్తారు చెప్పండి.
చాలా చక్కని చిత్రం. A సర్టిఫికేట్ వున్నా, పిల్లలతో చూడతగిన చిత్రం.
చిత్రం చివరిలో అందరు మంచిగా మారిపోతారు.
మరి మనమేం చేయాలి అని మన మనసు మనలను అడుగుతుంది.
ఈ సినిమా చూసాక ఏదైనా ఒక మంచి పని చేయాలి అనిపించింది.
(ఎప్పుడు చేయరా అని అడగకండి. ఎన్ని సార్లు తిన్నా మళ్ళీ మంచి భోజనం చేయాలనిపిస్తుంది. అలాగే ఇది కూడా.)

polimetla యొక్క టపా




